ఘనంగా కృష్ణ మోహన్ నల్లబల్లి పుట్టినరోజు వేడుకలు
ఒంగోలు: శనివారం జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగ సభ్యులు కృష్ణ మోహన్ నల్లబల్లి పుట్టినరోజు సందర్బంగా ఒంగోలు లోని 38వ డివిజన్ లో గల సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో బాగంగా కేక్ కట్ చేసి, అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మరియు అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు చనపతి రాంబాబు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, నవీన్ పవర్, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, 38వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు ఆలా నారాయణ, 28వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కోట సుధీర్ మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-10-at-7.49.57-PM-1.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-10-at-7.49.57-PM-1024x576.jpeg)