ఘనంగా ఉరిటి లక్కి గోవింద్ పుట్టినరోజు వేడుకలు

పెందుర్తి జనసేన పార్టీ ప్రచార కమిటీ మెంబర్ ఉరిటి లక్కి గోవింద్ పుట్టినరోజు సందర్భంగా లక్కి యువసేన టీం ఆధ్వర్యంలో ఉదయం ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి లక్కి గోవింద్ పేరు మీద అర్చన చేయించడం జరిగింది. తదనంతరం ఆకార్ బాలికల సంరక్షణ కేంద్రంలో బాలికలకు కూటమి నాయకులందరి ఆధ్వర్యంలో వారికి అల్పాహారాన్ని ఇవ్వడం జరిగింది. పెందుర్తి మండల గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్ల అందరికీ ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదగా పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ప్రచార కమిటీ మెంబర్ ఉరిటి లక్కీ గోవింద్ పుట్టినరోజు సందర్భగా కేక్ కట్ చేయడం జరిగింది. తదనంతరం దారా లావ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని మిత్రులు అభిమానులు శ్రేయోభిలాషుల ఉమ్మడి మహా కూటమి నాయకులు మధ్య కేక్ కట్ చేసి విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి జనసేన ముఖ్యనాయకులు వార్డ్ అధ్యక్షలు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోటిబాని శ్రీను, తెలుగుదేశం నాయకులు నమ్మి అశోక్, నంబారు రాజేష్, బాదంపూడి కృష్ణ, జనసేన నాయకులు చీర రాజు, ఉరిటి శ్రీను, బమ్మడి త్రినాథ్, దాకారపు శ్రీను, బొబ్బిలి శేఖర్, హర్షవర్ధన్, ప్రకాష్, పల్ల కళ్యాణ్, కృష్ణ, గోపాల్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment