హ్యాపీ బర్త్ డే మై డియర్ ప్రభాస్: మెగాస్టార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే మై డియర్ ప్రభాస్’ అని ట్వీట్ చేశారు. ఈ సంవత్సరం నీకు అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. దైవాశీస్సులు నీకు ఉంటాయని అన్నారు. మరోవైపు పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అవుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Happy Birthday Dear #Prabhas !
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2021
May you have a wonderful year ahead! Have a Great one 'Darling'!! 🙂 Stay blessed!