హ్యాపీ బర్త్ డే ప్రభాస్

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్‌లో ప్రవేశించి తనదైన శైలిలో రాణిస్తూ అందరి చేత డార్లింగ్ పేరును సొంతం చేసుకొన్న ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ రారాజుగా ఎదిగిన ప్రభాస్ నేడు 41వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇక కోట్లాది మంది ఆభిమానులు ఆయనకు తన బెస్ట్ బర్త్ డే విషెస్ ని అందిస్తున్నారు. సెలబ్రెటీలు కూడా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు.