పుట్టినరోజు శుభాకాంక్షలు సుకుమార్

‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయమైన సృజనాత్మక దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు నేడు. ఈ సందరభంగా ప్రముఖులు, అభిమానులు సుకుమార్  కు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

సుకుమార్ తూర్పు గోదావరి జిల్లాలో జన్మించగా, కాకినాడలో కొన్ని రోజులు మాథ్స్, ఫిజిక్స్ లెక్చరర్ గా చేశారు. ఆ తరువాత డైరెక్టర్స్ మోహన్, వివి.వినాయక్ సినిమాలకు కథల్ని అందించిన సుకుమార్..   ఫస్ట్ సినిమాకే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు గెలుచుకున్నాడు. బన్నీతో ‘ఆర్య’, ‘ఆర్య-2 ‘, రామ్‌తో ‘జగడం’, నాగచైతన్యతో ‘100 % పర్సెంట్ లవ్’, మహేష్‌బాబుతో ‘1 నేనొక్కడినే’, ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, రాంచరణ్ తో ‘రంగస్థలం’ సినిమాలు తీశాడు సుకుమార్. ప్రస్తుతం అల్లుఅర్జున్ తో ‘పుష్ప’ తో బిజీ గా ఉన్నాడు సుకుమార్. ఈ సినిమాను సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇండస్ట్రీతో పాటు అభిమానులు ముద్దుగా ‘సుక్కూ’ అని పిలుచుకునే ఈ విలక్షణ దర్శకుడి పుట్టినరోజు శుభాకాంక్షలు.