ప్రియమైన భార్యకు హ్యాపీ బర్త్ డే: నిఖిల్

టాలీవుడ్ హీరో నిఖిల్ లాక్‌డౌన్ సమయంలో తన ప్రేయసి పల్లవితో ఏడడుగులు వేసి ప్రస్తుతం తన భార్యతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 3న తన భార్య పల్లవి వర్మ బర్త్‌డే కావడంతో.. ఆమెతో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్ పెట్టాడు.

నా ప్రియమైన భార్యకు హ్యాపీ బర్త్ డే. నువ్వు నా జీవితంలో ఎప్పుడైతే వచ్చావో అప్పటి నుండి నా లైఫ్ అంతా ఆనందమయంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ని బట్టి నిఖిల్‌- పల్లవిలు తమ లైఫ్‌ను ఎంతో సంతోషంగా గడుపుతున్నట్టు అర్ధమవుతుంది. ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కార్తికేయ2 చిత్రంతో పాటు 18 పేజెస్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.