*బలిజ సంఘీయుల నుంచి వెల్లువెత్తిన అభినందనలు
ఆయన ఒక దార్శనికుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమకాలీనుడు. అలిపిరి సంఘటన జరిగిన సమయంలో తీవ్రంగా గాయాల పాలైన టిడిపి నాయకులలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోబాటు అప్పటి తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణ మూర్తి ఒకరు. ఆ తరువాత జరిగిన ఎన్నికల నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు చదలవాడ దూరంగా ఉన్నప్పటికీ ఆయన తన విద్యా సంస్థల నిర్వహణ విషయంలో బిజీ బిజీగా ఉంటున్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న మే 1వ తేదీన చదలవాడ కృష్ణమూర్తి కూడా జన్మించారు. గురువారం ఆయన 77వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని కాపు, బలిజ సామాజిక వర్గం యావత్తూ ఆయనకు వివిధ రూపాలలో ప్రత్యేక అభినందనలు తెలియ జేస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో జన్మించిన కృష్ణమూర్తి గతంలో బలిజ సామాజిక వర్గానికి రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈ సందర్భంగా జన్మ దినోత్సవం జరుపు కుంటున్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టిటిడి పాలకమండలి మాజీ చైర్మన్, కాపు, బలిజ సంఘీయుల ఆత్మీయ నేస్తం చదలవాడ కృష్ణమూర్తికి ఘనమైన శుభాకాంక్షలు తెలియ జేసిన వారిలో ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గ కాపునాడు అధ్యక్షులు పోగుల మల్లికార్జున రావు, ప్రధాన కార్యదర్శి దాసరి పిచ్చయ్య నాయుడు, ఉపాధ్యక్షుడు చెంగలశెట్టి సుధాకర్ రావు, జాయింట్ సెక్రటరీ గారా నారాయణ, ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గ కాపునాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచాల కవిత, జిల్లా కాపునాడు యూత్ అధ్యక్షుడు బండారు సురేష్ లతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ సేన లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు ఆరిగ మహేశ్వరి, నెల్లూరు జిల్లా కాపు బలిజ సంక్షేమ సేన ఉపాధ్యక్షురాలు నాయుడు శైలజ, కాపు, బలిజ సంక్షేమ సేన కందుకూరు నియోజక వర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు చదలవాడ కామాక్షీ నాయుడు, ప్రధాన కార్యదర్శి జి.ప్రియాంక, కందుకూరు నియోజక వర్గం పరిధి లోని లింగసముద్రం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అంగులూరి. నరసింహా రావు, వలేటివారి పాలెం మండల జనసేన నాయకులు బండారు వెంకట సుబ్బయ్య, గుడ్లూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అన్నంగి చలపతి రావు తదితరులు ఉన్నారు.
Share this content:
Post Comment