ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి మంగళవారం తన జన్మదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా నుండి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున జనసేన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్లు, లాయర్లు, ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చీపురుపల్లి నియోజకవర్గం నుండి కొన్ని కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. పార్టీ బలోపేతం దిశగా ఆవిర్భావ దినోత్సవం ముందునుంచే జనసేనలో చేరికలు వేగవంతం కావడం హర్షణీయమని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
Share this content:
Post Comment