పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు: నేమూరి శంకర్

కూకట్ పల్లి నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత వ్యక్తిత్వం ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ కీర్తి ప్రతిష్టలు అజరామరంగా వెలుగొందాలని, ఆయనకు సుసంపన్నమైన ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని, ప్రజలు ఆయనకు రాజ్యాధికారాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శంకర్ గౌడ్ తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, సమాజానికి మంచి చేసే విధంగా, ఆయన మనసుకు నచ్చే విధంగా పలు కార్యక్రమాలతో ప్రజలలోనికి వెళ్ళాలని పిలుపునిచ్చారు.