హ్యాపీ బర్త్ డే రానా

సినిమా సినిమా కు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్ గా మారిన  దగ్గుబాటి రానా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు రానా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తన మొదటి సినిమాతోనే ‘లీడర్’ అనిపించుకున్న రానా.. సామాన్యుడిని చైతన్యపరిచేలా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమా కూడా క్లాస్ ఆడియన్స్‌కు నచ్చిన సినిమా. ఇక బాహుబలి లాంటి ప్రతికూల క్యారెక్టర్ లోను రానా అద్భుతంగా నటించి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఘాజీ లాంటి భిన్నమైన సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు రానా. ‘నేనే రాజు నేనే మంత్రి’ ఎలాగైన ముఖ్యమంత్రి కావాలన్న ఆశ జోగేంద్ర నటనని మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది హీరో రానా దగ్గుబాటి మిహికా బజాజ్‌కు మూడు ముళ్లు వేసి వివాహ బంధంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రానా ‘అరణ్య’, ‘విరాటపర్వం’ చిత్రాల్లో నటిస్తున్నారు.