రవణం స్వామినాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు: త్యాడ రామకృష్ణారావు

అభిమాని ఆయన పేరు..
అభిమానం ఆయన తీరు..
చిరంజీవి అంటే మా అందరికీ
వల్లమాలిన ప్రేమ..
మేమంటే
మా స్వామినాయుడికి
సోదర ప్రేమ…!

మా కష్టం ఆయన కష్టమై
అది తీర్చే అన్న..
ఆయన మనసే వెన్న..
అన్న చిరు స్ఫూర్తితో
తాను సైతం…
అనురాగ మలయమారుతం!

ఎవరికి అవసరం ఉన్నా
నాయుడన్న సిద్ధం..
సాయమే తన నైజం..
ఇది ముమ్మాటికీ నిజం..!

మాట తీయన..
మనసు చల్లన..
కపటం ఎరుగని బుద్ధి..
సాయం చేయడమే ఎరుక
అలా అయ్యాడు
మా అభిమానుల ఏలిక!

గురువుగారు శ్రీ రవణం స్వామినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. మీరు ఇలాగే నూరేళ్ళు చల్లగా ఉండాలని కుంటున్నా.. అంటూ విజయనగరంజిల్లా చిరంజీవియువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) విజయనగరంజిల్లా చిరంజీవియువత తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.