జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆహుడా చైర్మన్ టి.సి. వరుణ్ కి జనసేన పార్టీ సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు మరియు యువ నాయకులు తోట రామమోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 10 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన టి.సి. వరుణ్ గారు తన అసాధారణమైన నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవా ధ్యేయంతో నిరంతరం ముందుకు సాగుతూ నేడు ఆహుడా చైర్మన్ పదవిని సాధించారు. 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూసినా వెనుకడుగు వేయకుండా పార్టీ పట్ల నిబద్ధతతో ముందుకు సాగిన ఆయన, 2024 ఎన్నికల్లో అవకాశం రాకపోయినా పవన్ కళ్యాణ్ గారి మాటకు కట్టుబడి నిలిచారు. కూటమి అభ్యర్థుల విజయానికి అహర్నిశలు కృషి చేసి, పార్టీ విజయం కోసం నిబద్ధతతో పనిచేశారు. స్వార్థరహిత రాజకీయ జీవితం ఎలా ఉండాలో తన కార్యాచరణతో చాటిచెప్పిన టి.సి. వరుణ్ గారు భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తోట ఓబులేసు తెలిపారు.
Share this content:
Post Comment