ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. తెలంగాణా గవర్నర్‌, సీఎం

ఈ రోజు ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా 70 వ వసంతంలోకి అడుగుపెట్టిన మోదీకి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌, సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మన దేశానికి ప్రధాని మోదీ గొప్ప సంపద అని  తమిళిసై అభివర్ణించారు.

రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున సీఎం కేసీఆర్ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజీస్తూ..దేశానికి మోదీ మరిన్ని సేవలు అందించాలని సీఎం ఆకాంక్షించారు.