రైతులందరికీ అంతర్జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు: బొబ్బేపల్లి సురేష్

రైతు దినోత్సవ వేడుకలలో భాగంగా గిరిజన కుటుంబాలకు బియ్యం పంపిణీ, మరియు పిల్లలకి బిస్కెట్లు, పండ్లు పంపిణీ

సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం, కొత్తకోడూరు దగ్గర రోడ్ సైడ్ నివాసముంటున్న గిరిజనులను శుక్రవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు కలిసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి 17 గిరిజన కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఈ ప్రాంతంలో నివాసముంటున్న గిరిజనులకు మాత్రం కనీసం ఉండటానికి ఇల్లు గాని, తినటానికి రేషన్ బియ్యం గాని ఇప్పటివరకు అందించిన దాఖలాలు లేవు, ఎన్నికల సమయాలలో ఓట్ల కోసం వస్తారు, పోతారు తప్ప, గిరిజనుల సమస్యలు వారికి పట్టవా, అదేవిధంగా వీరికి రేషన్, ఆధార్ కార్డులు లేవు, కొంతమందికి ఓటర్ కార్డులు కూడా లేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం ఇచ్చేంతవరకు ప్రతి నెల కూడా కుటుంబానికి 10 కేజీలు చొప్పున తాము బియ్యం అందజేయడం జరుగుతుందని. అదేవిధంగా రైతు దినోత్సవం సందర్భంగా ఇక్కడ నివాసముంటున్న గిరిజన కుటుంబాలకు ఒక కుటుంబానికి 10 కేజీలు చొప్పున బియ్యం అందివ్వడం జరిగింది. అదే విధంగా పిల్లలకి బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ, ఐసిడిఎస్ వారు ఇకనైనా కళ్ళు తెరిచి గిరిజనులకి ఉండటానికి ఇల్లు ఇవ్వాలి. అదే విధంగా వాళ్ళ పిల్లల్ని ఐసిడిఎస్ వారు అంగన్వాడి స్కూల్ కి తరలించి వారికి మంచి భోజనం, బట్టలు అందించాలి అని రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి కాకి లెక్కలు చెప్తున్నారు. ఇప్పటివరకూ కూడా పూర్తిస్థాయిలో సొంత ఇల్లు లేని ఎంతోమంది పేద గిరిజనలు ఉన్నారు. వీళ్ళందరూ మీకు కనిపించడం లేదా అని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తేలిమేటి చిన్న, ఠాగూర్, వెంకటేశ్వర్లు, ముత్తుకూరు మండల నాయకులు రహీం భాయ్ , శ్రీహరి, రహమాన్, తదితరులు పాల్గొన్నారు.