అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు!

*సర్వేపల్లి జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నేతృత్వంలో, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ముత్తుకూరు మండలంలో కార్మిక దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ మాట్లాడుతూ కార్మిక దినోత్సవం అంటే—దేశానికి ఇంధనంగా నిలిచే కార్మికుల యొక్క చెమటకు గౌరవం చెల్లించే రోజు. ఎన్నోమంది కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతూ ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగఫలంగా 12 గంటల పని సమయాన్ని 8 గంటలుగా కుదించాడు. అదే విధంగా కార్మిక హక్కులు సాధించడంలో వారు కీలక పాత్ర పోషించారు. ఈ కారణంగానే మే 1న ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ పనికి ఆహార పథకం కింద పనిచేసే కూలీలను “కార్మికులు”గా గుర్తించడం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ శ్రామికులకి, చేతివృత్తుల వారికీ అండగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు రహీం, సందూరి శ్రీహరి, శ్రీను, పెడకాల కిషోర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment