జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!

అన్యాయాలు అధికారానికి అలవాటుగా మారిపోతుంటే, ప్రజల కోసం నిర్మించిన చట్టాలు సత్తు బండలు అవుతుంటే, స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తిని గుండె నిండా నింపుకున్న నిప్పుకణిక రగిలిన రోజు. భంగపడిన సామాన్యుడి కన్నుల్లో కన్నీరు ఇంకిపోతుంటే, చూస్తూ ఊరుకోకుండా, చేసేదాన్ని చెప్పుకోకుండా, చేయాల్సింది చేస్తూనే… రాముడు రాజ్యం విడిచిన రోజు, ఉన్నదంతా ప్రజలకు పంచిన రోజు, సామాన్యుడి రక్షణకవచ దక్షుడై దానవేంద్రుడై దిగివచ్చిన రోజు – సిపిఎఫ్ నవరాజ్యం రావాలని, యువరాజ్యానికి సారథ్యం వహిస్తూ, మధిస్తూ, శోధిస్తూ పాపపంకం నుంచి పద్మాలు పుట్టించాలని ప్రయత్నిస్తుంటే… ఇంకా దుర్మార్గం పెట్రేగిపోతుంటే, తోడేళ్ల గుంపు అధికారాన్ని చలాయిస్తుంటే, నక్కలు విషప్రచారాల ఊళలు వేస్తుంటే, పందికొక్కులు ప్రజల సొమ్ము తినేస్తుంటే, అబద్ధం దర్జాగా బ్రతికేస్తుంటే… నిజాయితీతో నిర్భయంగా నిజం ప్రశ్నించిన రోజు – మార్చి 14, 2014. నిద్రావస్థలోని సమాజం అపస్మారక స్థితిలోకి జారిపోతుంటే, కోటి గొంతులు కోరి శక్తి కోసం అర్థిస్తుంటే… సృష్టి కారణమైన ఆ మహాశక్తి స్పందించిన రోజు… చేయి అందించిన రోజు… ఆ చేయి పిడికిలి బిగించిన రోజు, పిడికిలి దేశపు జెండా పొగరు చూపించిన రోజు, రాజకీయాల్లో భూకంపం పుట్టిన రోజు, రాజకీయాలు భూమార్గం పట్టిన రోజు, అమ్మ పంపిన… శక్తిని ఇచ్చే అన్న కోసం ఏళ్లు ఎదురుచూసిన మా నవతరం, యువతరం కల పండిన రోజు – 21/21. సమకాలీన రాజకీయాలను కులాల కుళ్లు కుతంత్రిష్టులు, మతాల మతలబిష్టులు, రంగుల రేసిస్టులు రాచపుండులుగా మార్చేసిన కాలంలో… సనాతనంలో ఆధునికుడిగా, ఆధునికంలో సనాతనుడిగా, ఆధ్యాత్మికంగా అత్యంత ఎత్తులోంచి అన్నింటిని చూసే పవన్ కల్యాణ్ ఒక్కడికే “పర్వతం వంగి ఎవడికి సలాం కొట్టదు” అనగలిగే సత్తా, దమ్ము, ధైర్యం ఉంది. పవన్ కల్యాణ్ ఇచ్చిన ధైర్యాన్ని, నా స్వరాన్ని, నా కలాన్ని, నాతో పాటు ఉన్న సామాన్యుల బలాన్ని ఆయుధంలా మార్చుకుని… ఇంకా మిగిలి ఉన్న యుద్ధంలో సేనాని కోసం ముందు వరుసలో నిల్చొని మందుపాతర పేల్చుకోవడానికి సెకను కూడా సంకోచించని సైనికుడిగా.. నిజాయితీ, నిబద్ధత, నిస్వార్ధతలను నమ్మిన నిజమైన సైనికులందరికీ… జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! అని చేతన్ కొల్కర్ (ఓడకళాసీ) ఫ్రంట్ లైన్ సోల్జర్ యురోప్ సేన-ఐర్లాండ్ పేర్కొన్నారు.

Share this content:

Post Comment