నూతన సంవత్సర శుభాకాంక్షలు: డా. యుగంధర్

  • రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం
  • పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల మనసుల్లోకి
  • ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం
  • జనసేన ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కార్వేటినగరం, వెదురుకుప్పం, పాలసముద్రం మండల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు, అధికారులకు, అనధికారులకు, పోలీస్ సిబ్బందికి, పోలీస్ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేసారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లి, ప్రజా మద్దతు కోరతామన్నారు. నియోజకవర్గంలో ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం కలిసి విజయటంకా మోగిస్తుందని, రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని, 175 నియోజకవర్గాల్లో సర్వరంగ సమగ్ర అభివృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటినగరంటౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, జిల్లా సంయుక్త కార్యదర్సులు భాను ప్రసాద్, రాఘవ, నరేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ కార్యదర్శి అన్నములై, వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, టౌన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సూర్య నరసింహులు, వెదురు కుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, టౌన్ కమిటీ కార్యదర్శి బాల వరదయ్య, ఎం ఎం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర పాల్గొన్నారు.