సోషల్‌ మీడియాలో వేధిస్తున్నారు.. మాధవి లత ఆవేదన

సోషల్‌మీడియాలో కొందరు తనని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, సినీ నటి, భాజపా నాయకులు మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఆమె గురువారం సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ”ఓ వర్గం సోషల్‌మీడియాలో ఓ వర్గం నన్ను టార్గెట్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెడుతోంది. ఏదైనా కేసులో అమ్మాయిలు పట్టుబడితే అందులో నేను కూడా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి దారుణాలపై ఇంతకాలం సోషల్‌మీడియా వేదికగా పోరాటం చేశా. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మానసికంగా నన్ను మరింత కుంగదీస్తోంది. అందుకే సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాను. ఇలాంటి అభ్యంతరకర చర్యలకు పాల్పడుతున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను” అని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు.