పవర్ స్టార్ ను కలిసిన హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ చిత్రం వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న పవన్ కు ఈ చిత్రం ఊపిరి పోయడమే కాద.. అభిమానుల్లో రెట్టింపు సంతోషాన్ని నింపింది. ఈ సినిమా హిట్ తర్వాత మరోసారి వీరిద్దరి కలయిక లో సినిమా కోసం ఎదురుచూసారు కానీ అప్పుడు కుదరలేదు. ప్రస్తుతం ఇప్పుడు వీరిద్దరి కలయికలో మూవీ తెరకెక్కబోతుంది.

ఈ సినిమా నిమిత్తం డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా పవన్‌ను కలిశారు. ఆయనతో చాలా సేపు మాట్లాడారు. ఈ విషయాన్ని హరీష్ శంకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారట. వేసవి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వస్తానని పవన్ మాటిచ్చినట్టు తెలుస్తోంది. 2022 వేసవి టార్గెట్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతంపవన్ వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. త్వరలో డైరెక్టర్ క్రిష్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. దీనితోపాటే అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌ షూటింగ్‌లో కూడా పాల్గొంటారట. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్‌లో నటించనున్నాడు.