‘నీలి నింగి తాకాలని’ మధుర గీతం విడుదల చేసిన హరీష్ శంకర్

కమెడియన్‌ సప్తగిరి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘గూడుపుఠాణి’.. ఈ చిత్రంలో మరో అద్భుతమైన ‘నీలి నింగి తాకాలని’ అంటూ సాగిన ఫుల్ లిరికల్ సాంగ్‌ను ఈ రోజు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ చిత్రానికి ప్రతాప్‌ విద్య సంగీతం అందించారు. ఈ పాటకు వంశీ కమల్ లిరిక్స్ అందించగా.. ప్రతాప్ విద్య స్వరాలు అందించారు. హీరో హీరోయిన్లు జీపులో ప్రయాణిస్తుండగా ప్రకృతిని ఆస్వాదించే నేపథ్యంలో ఈ గీతం సాగుతుంది. ఈ గీతాన్ని ప్రముఖ గాయని సునీత ఆలపించారు.

ఈ చిత్రంలో నేహా సోలంకి.. సప్తగిరితో జోడీ కడుతుండగా.. కుమార్‌ కేఎమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఆర్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ రెడ్డి రమేష్ యాదవ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘు కుంచే కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: పవన్ చెన్నా, కూర్పు: నాగేశ్వర్రెడ్డి