మూడోసారి జోడికట్టనున్న షారూక్‌, దీపిక

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారూక్‌ఖాన్, దీపికా ప‌దుకొనెతో ముచ్చ‌ట‌గా మూడోసారి జోడీ క‌ట్ట‌నున్నారని బాలీవుడ్ వ‌ర్గాల నుండి వినిపిస్తోంది. ఈ ఏడాదితో 50 వ‌సంతాల‌ను పూర్తి చేసుకోనున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిలింస్ వారు కొత్త ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టనున్నారు. ఇందులో షారూక్‌, దీపికా ప‌దుకొనె న‌టించ‌నున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. షారూక్ ఖాన్ హీరోగా చేసిన ‘ఓంశాంతిఓం’ సినిమాతోనే దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.  త‌ర్వాత ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’‌లోనూ క‌లిసి న‌టించారు. ఇపుడు ముచ్చ‌ట‌గా మూడోసారి అభిమానులకు వెండితెరపై కనువిందు చేయనున్నారు.