సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముత్తుకూరు మండలంలో జనసైనికులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదాపురంలో 250 కోట్ల రూపాయలకి పైబడి మైనింగ్ మాఫియా జరిగింది. ఇది వాస్తవం అక్కడ పర్మిషన్ లేకుండా నాటు పేలుడు పదార్థాలు ఉండడం వాస్తవం. అయితే గత రెండు రోజుల నుంచి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి కాకాణి గోవర్ధన్ రెడ్డి అవినీతి చేయలేదు, అక్కడ మైనింగ్ మాఫియా జరగలేదు, అక్కడ నాటు బాంబులు లేవు ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీ వైసీపీ పరిపాలనలో మైనింగ్ మాఫియా తరలింపు జరిగే సమయంలో మూడు రోజులపాటు నేటి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్ష చేసింది వాస్తవం కాదా? గూగుల్ ఫోటోల ద్వారా అక్కడ అనుమతులు లేని నాటు బాంబులు మరియు అక్రమంగా తెల్ల బంగారం మొత్తం గూగుల్ ఫోటోల ద్వారా కేంద్ర గనుల శాఖకి మరియు జిల్లా కలెక్టర్ కి ఆనాటి అధికారులు అందరికీ కూడా పంపించడం జరిగింది. ఇది వాస్తవం ఈ అక్రమ మైనింగ్ లో ముద్దాయి నెంబర్ 4 కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇందులో భాగస్వామ్యం లేకపోతే ఎందుకు పారిపోయాడు ఎందుకు కనిపించడం లేదు? కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏమన్నా నిజాయితీపరుడా? చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి నోరు ఉంది కదా అని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా దూషణలు చేస్తే మీరు చూస్తా ఊరుకుంటారా? మీ స్కూల్లో చదివే పిల్లలకి మీరు నేర్పించే సంస్కారం ఇదేనా? అవినీతి చేసినటువంటి వ్యక్తిని వెనకేసుకుని వస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి నెల్లూరు జిల్లాలో ఉన్న వైసిపి నాయకులారా మీరు నీతి నిజాయితీల గురించి, పరిపాలన గురించి, కుల మత వర్గ బేధాలు గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని నాయుడు, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, బోలా అశోక్, చిన్న, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment