వైసీపీ పాలనలో ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధన అసాధ్యం: డాక్టర్ యుగంధర్ పొన్న

*అగమ్య గోచరంగా మారిన గ్రామీణ ప్రజల ఆరోగ్యం

*ప్రజల ఆరోగ్య స్థితిగతులపై వాలంటీర్ల ద్వారా సర్వే చేయాలి

*ఆర్థిక సహాయం అందించిన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న

కార్వేటి నగర మండలం, కేఎం పురం గ్రామపంచాయతీ, కేఎం పురం ఏ ఏ డబ్ల్యూ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి ఉమామహేశ్వరిని నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న పరామర్శించారు. మంచి ఆరోగ్యం కలిగి ఉన్న ఉమామహేశ్వరి (నాలుగు సంవత్సరాల వయస్సు) గత రెండు నెలలు రుయా ఆసుపత్రికి పరిమితమై కళ్ళు కనపడిన పరిస్థితుల్లో మెదడుకు సంబంధించిన అనారోగ్యంతో మరియు మూర్చ వ్యాధి తో బాధపడుతూ ఇటీవలే డిశ్చార్జ్ అయి ఇంటికి రావడం జరిగిందని, ప్రస్తుతం మాటలు రాని పరిస్థితుల్లో, శక్తి లేక ఇబ్బంది పడుతున్న ఈ చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తే తొందర్లోనే శారీరకమైన ఆరోగ్యo పొందుకొనే వీలుందని తెలిపారు. ఇంకా మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. స్వయాన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఉన్న నియోజకవర్గం కాబట్టి వాలంటీర్లు పగడ్బందీ సర్వే చేసి ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేసి, వైద్య సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం కలుగజేసుకొని ఈ చిన్నారికి కార్పొరేట్ వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ల సేవలు మరింత విస్తృతం చేసి ఆరోగ్యం మొదలుకొని ప్రజల చెంతకు చేరే సౌకర్యం వరకు వారికి ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపారు. డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన అసాధ్యమని దుయ్య బట్టారు . ప్రజల ఆరోగ్యం ఆగమ్య గోచరంగా మారిందని ఎద్దేవా చేశారు. గ్రామంలో ఇళ్ల పట్టాలు లేని వాళ్ళు అనేకమంది ఉన్నారనీ వారికి వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. అదేవిదంగా గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా నడవలేని స్థితిలో ఉన్న గజేంద్రయ్యకు మూడు చక్రాల సైకిల్ ను మండల అధికారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్
ప్రధాన కార్యదర్శి వెంకటేష్ కార్యదర్శులు కొణిదల మధు, టి .వాసు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నాయకులు అభి, సూర్య, జనసైనికులు మరియు గ్రామస్తులు ఉన్నారు.