ఆశ్రమ పాఠశాలలో తక్షణమే హెల్త్ అసిస్టెంట్ & ఎ.ఎన్.ఎం లను నియమించాలి

  • జనసేన పార్టీ జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న

పాడేరు: అల్లూరి జిల్లా, ఏజెన్సీ 11 మండలలో సుమారు 122 ఆశ్రమ పాఠశాలలో తక్షణమే హెల్త్ అసిస్టెంట్ & ఎ.ఎన్.ఎం లను నియమించాలని జనసేన పార్టీ జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న ప్రభుత్వాన్ని కోరారు. వై ఎస్ ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాల్గున్నార సంవత్సరాల కాలంలో ఆశ్రమ పాఠశాలలో తగిన వైద్య సదుపాయం లేక పదుల సంఖ్యలో పిల్లలు మరణించడం జరిగింది. ప్రభుత్వనిర్లక్ష్యంతో పిల్లల మరణాలవల్ల వారియొక్క తల్లిదండ్రుల కడుపుకోత మిగిల్చింది. కావున ఈ విద్యా సంవత్సరంలో అయినా ముందు చూపుగా ఏ మాత్రం నిర్లక్ష్యం కాకుండా హెల్త్ అసిస్టెంట్ & ఎ ఎన్ ఎమ్ లను నియమించాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్రలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం నియమించుకున్న ఛిరుద్యోగులకు కార్పొరేషన్లో పెట్టి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, కళ్ళబోల్లి మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ & ఎ.ఎన్.ఎమ్ లను అకాలంగా తొలగించి ఆశ్రమ పాఠశాల పిల్లల మరణలకు ఈ ప్రభుత్వం కారణమైంది. ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు సకాలంలో వైద్య సదుపాయాలు లేక గిరిజన విద్యార్థులు మరణించడం జరిగినది. ఈ మరణాలను ప్రభుత్వ హత్యలు గానే జనసేన పార్టీ భావిస్తుంది. ఇదే కాకుండా ఈ ఉద్యోగం మీద ఆధారపడ్డ హెల్త్ అసిస్టెంట్ & ఎ ఎన్ ఎమ్ లా కుటుంబాలు వీధిన పడ్డాయి. విద్య, వైద్య, ఉపాధి హామీ వంటి పలు కీలక రంగాల్లో ఉన్నా ఔట్ సోర్స్ ఉద్యోగులను నిలువునా ముంచారు. తద్వారా సిబ్బంది కరువయ్యారు. ఆ ఫలితమే ఇవాళ విద్యార్థుల మరణాలకు పరోక్ష కారణం కావున ఆశ్రమ పాఠశాలలో హెల్త్ అసిస్టెంట్ & ఎ.ఎన్.ఎమ్లను నియమించి గిరిజన విద్యార్థుల మరణాలను హారికట్టాలని లేని పక్షంలో జనసేన పార్టీ తరుపున విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి పెద్ద ఎత్తున్న ఉద్యమాలు చేస్తామని జి.మాడుగుల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మసాడి భీమన్న ప్రభుత్వాన్ని హితవు పలికారు.