భద్రాద్రిలో భారీ వర్షాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇల్లందు, కోయగూడెం సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. వర్షాల కారణంగా ఇప్పటికే కొత్తగూడెం జీకే ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది.