హలో ఏపీ – ఛలో అమరావతి

*బాబు, పవన్ నేతృత్వంలో అమరావతి అజరామర అభివృద్ధి
*దేశం మొత్తం చూసేలా అమరావతి పునః ప్రారంభ వేడుకలు
*ప్రతీ ఆంధ్రుడు గర్వపడేలా మోదీ పర్యటన
*ప్రజలకు మోదీ సభ ఆహ్వాన ప్రతుల అందచేత

ఐదేళ్ళ వైసీపీ నిరంకుశ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి ప్రధాని మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో అజరామర అభివృద్ధి దిశగా అడుగులేస్తుందని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. మే 2 శుక్రవారం నాడు ప్రధాని మోదీ అమరావతి రానున్న నేపథ్యంలో హలో ఏపీ – ఛలో అమరావతి పోస్టర్లను అయన కూటమి నేతలతో కలిసి బుధవారం శ్రీనివాసరావుతోటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ సభకు సంభందించి ఆహ్వాన ప్రతులను ప్రజలకు అందించారు. ఆళ్ళ హరి మాట్లాడుతూ అమరావతి రాజధానిపై వైసీపీ చేసిన విషపూరిత కుట్రలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరన్నారు. రాష్ట్రం కోసం తమ పచ్చటి పంట పొలాలను త్యాగం చేసిన రైతులకు వైసీపీ ప్రభుత్వం క్షణక్షణం నరకం చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిని ప్రతీ ఆంధ్రుడు గర్వపడేలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ వివిధ స్థాయిల్లో సుమారు లక్ష కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంఖుస్తాపన చేసేందుకు రాష్ట్రానికి రావటం శుభపరిణామమన్నారు ఆంధ్రుల ఆత్మ గౌరవానికి, ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు అమరావతి తరలిరావాలని ఆళ్ళ హరి ప్రజల్ని కోరారు. కార్యక్రమంలో కూటమి నేతలు షేక్ మెహబుబ్ బాషా, కోలా అంజి, వడ్డే సుబ్బారావు, నండూరి స్వామి, పసుపులేటి నరసింహారావు, ఇల్లా శేషు, పట్టంశెట్టి చిట్టీ, పోతురాజు, స్టూడియో బాలాజీ, జక్కా రాఘవులు, పడిసిపోగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment