- కడప పార్లమెంట్ సమన్వయకర్త తాతంశెట్టి నాగేంద్ర
కడప జనసేన నాయకులు జీవీ రమణ మరియు తుంగ రమణయ్య ఆధ్వర్యంలో పండ్రా రంజిత్ కుమార్ అధ్యక్షతన కడప పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త తాతంశెట్టి నాగేంద్ర ముఖ్య అతిథిగా కడప జిల్లా జనసేన సమన్వయ సమావేశం దేవుని కడప కాలవ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసి కార్యకర్తలకు చలో పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ గురించి దిశ నిర్దేశం చేశారు మొదట సంధ్య సర్కిల్ నుంచి దేవుని కడప వరకు రాష్ట్రంలోనే ప్రప్రదంగా జనసేన ఆవిర్భావ సభ బైకు ర్యాలీ కడపలో భారీ ఎత్తున నిర్వహించి తిరుమల తొలి కడప్ప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఛలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ పార్టీ నేతలు, కార్యకర్తలు హలో కడప–ఛలో పిఠాపురంతో కధం తొక్కడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. 14వ తేదిన కోట్లాది మంది ప్రజల్లో కడప ప్రత్యేకతను చాటుకునేలా శ్రేణులు ముందుకు రావడం హర్షణీయమని తెలిపారు. కడపలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు కృషి చేసి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఇదే ఉత్సాహంతో పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్బావ సభలో పాల్గొనాలన్నారు. ఈనెల 13న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి బయలుదేరే బస్సుల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మనందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలియజేయాలని ఆయన సూచించారు. అనంతరం పార్టీ నేతలు జి. వి రమణ, తుంగ రమణయ్య ఇతర నేతలు మాట్లాడుతూ పిఠాపురం సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వస్తాయని, ఇందుకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్న తాతంశెట్టి నాగేంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఉదయశ్రీ, సీనియర్ నాయకులు వేణు రెడ్డి, నాగార్జున, హరీష్, శివ కళ్యాణ్, అబ్బన్న గారి రాజగోపాల్, మాలె శివ, గోగు భరత్ గజ్జల సాయి, ఉంగరాల విజయ్, తిరుమల శెట్టి సిద్ధార్థ, నాగరాజ్, ఆకుల గోపి, శేషు రాయల్, బసెట్టి స్వరూప్, వినయ్, తేజ, సాయికృష్ణ, బాలు, కుమార్ నాయక్, రామ్ సిద్దు, యువరాజ్ రాము, గౌస్ లాజం, దాదా పీర్, జిలాని భాష, అబ్దుల్ మాలిక్, పవన్, కడప పార్లమెంట్ పరిధిలోని జనసేన నాయకుడు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment