- జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం” కార్యక్రమంకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన జనసేన నాయకులు
జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరుగబోయే “జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం” కార్యక్రమంకు సంబంధించిన పోస్టర్ ను జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు ఒడిదుడుకుల తర్వాత అధికార భాగస్వామ్యంతో పండగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు తరలిరావాలని పిలుపునిచ్చారు. దశాబ్ద కాలంలో పేదల, రైతుల అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ ని రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి లో కాదు కేంద్ర స్థాయిలో చూడాలని మా ఆకాంక్ష. పవన్ కళ్యాణ్ పేరు స్మరించడానికి కూడా జగన్ మోహన్ రెడ్డి కి అర్హత లేదన్నారు. నీలాగా తండ్రి చనిపోతే పదవి కోసం పరుగులెత్తిన వైనం కాదని అని జగన్ ని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ ఏనాడు పదవుల కోసం ఆశపడిన వ్యక్తి కాదు.. కేవలం ప్రజా శ్రేయస్సు కోసం పాటుబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. దాదాపుగా 1500 మంది రైతుల కుటుంబాలకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ కార్యకర్తలకు ప్రమాదంలో మరణిస్తే సొంత నిధులతో ఐదు లక్షల రూపాయలను కార్యకర్తల కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం రైతుల భవిష్యత్తు కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసి దశాబ్ద కాలం తర్వాత జనసేన పార్టీ అధికారం చేపట్టిందన్నారు. అధికార పీఠం అధికార భాగస్వామ్యంతో జనసేన పార్టీ ఈనెల మార్చి 14న పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడా గ్రామంలో జరుగు ఆవిర్భావ దినోత్సవ సభకు మంగళగిరి నియోజకవర్గం నుంచి వెల్లదలుచుకునే కార్యకర్తలకు, అభిమానులకు బస్సు సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. పండుగ వాతావరణం లో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు భారీగా తరలి రావాలని ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎం.టి.ఎం.సి అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతిరావు, ఎం.టి.ఎం.సి ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మంగళగిరి యువజన నాయకులు చిట్టెం అవినాష్, జనసేన నాయకులు కంకణాల శంకర్, తిరుమలశెట్టి కొండలరావు, జొన్న రాజేష్, బాల సౌరి, తిరుమలశెట్టి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment