జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజోలు జనసేన పార్టీ ఐటీ విభాగం వినూత్న ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. “హలో రాజోలు – ఛలో పిఠాపురం” అనే నినాదంతో తమ ఫోటోలతో కూడిన కామన్ డీపీలు (డిస్‌ప్లే పిక్చర్) సృష్టించి రాజోలు పట్టణాన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేశారు. పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమమైనా విజయవంతం చేయడంలో ఐటీ విభాగం సభ్యులు తమ కృషిని నిరూపించుకుంటున్నారు. ఈ ప్రచారంతో రాజోలు జనసేన సోషల్ మీడియా ఖాతాలు “హలో రాజోలు – ఛలో పిఠాపురం” పోస్టర్‌లతో హోరెత్తిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ గారి మార్గదర్శకంలో, ఐటీ కోఆర్డినేటర్ యెనుముల లక్ష్మణ్ నేతృత్వంలో అరవ సందీప్, చింతక్రింద శ్రీనివాస్, సుధాకర్, ఉదయ్, నాగు, శేఖర్ తదితరులు ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించారు. జనసేన ఆవిర్భావ సభకు రాజోలు నుండి భారీ సంఖ్యలో జనసైనికులు హాజరై సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Share this content:
Post Comment