ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలో నిర్వహించిన “హల్లో సరుబుజ్జిలి – చలో పిఠాపురం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళీ మోహన్ గారు పిలుపునిచ్చారు. ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో మురళీ మోహన్ మాట్లాడుతూ, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ మహోత్సవాన్ని పండగలా జరుపుకోవాలని, గత ప్రభుత్వ పాలనలో ఎన్నో పోరాటాలు చేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ నిలబడ్డ విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రతి గ్రామం నుండి పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా “హల్లో సరుబుజ్జిలి – చలో పిఠాపురం” పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు తులగపు ధనుంజయ్, సంఘంశెట్టి తేజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు పేడాడ రమణ, బొగ్గు అప్పలరాజు, గొల్లపల్లి శ్రీధర్, సతివాడ రామకృష్ణ, మురాల మిన్నారావు, మండల నాయకులు బాణాన భార్గవ్, శ్రీనివాస్, గదిలి రమణ, నారాయణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment