హలో వి.ఆర్.పురం ఛలో పిఠాపురం

మార్చి 14వ తేదీ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా జనసేన పార్టీ వి.ఆర్.పురం మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బొలిశెట్టి సత్యనారాయణ, ఆదినారాయణ పాల్గొని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పోస్టల్ ఆవిష్కరించడం జరిగింది. బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అవతరించి నేటికీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని రెండు చోట్ల ఓడిపోయినా అధైర్యపడకుండా ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన పవన్ కళ్యాణ్ గారి కష్టానికి రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఒక్కసారిగా జనసేన వైపు చూసే విధంగా పోటీ చేసిన 21 స్థానాల్లో పూర్తిగా విజయం సాధించి ఘనంగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మార్చి 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరూ ఐక్యమై మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా నిలవాలని అందరూ ఐక్యతతో పిఠాపురంలో జరగబోయే సభలు విజయవంతం చేయాలని కోరడం జరిగింది. పి. ఆదినారాయణ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి సరైన సమయంలో అవకాశాలు వస్తాయని వ్యవస్థలో మార్పు రావాలంటే జనసైనికుల వలనే సాధ్యమని అన్నారు. మండల కమిటీ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య మరియు మరికొన్ని సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కుర్ల రాజశేఖర్ రెడ్డి, లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకి స్వామి, వి ఆర్ పురం మండలం ఉపాధ్యక్షురాలు వాగులు ప్రమీల రాణి, కూనవరం మండల అధ్యక్షులు దాసరి నరేంద్ర కుమార్, చింతూరు మండల అధ్యక్షులు మడివి రాజు, కూనవరం సర్పంచ్ మల్లపల్లి హేమంత్ గాంధీ, కూనవరం వైస్ ఎంపీపీ బండారు సాంబశివరావు, రాగల సురేష్, వి ఆర్ పురం మండల ప్రధాన కార్యదర్శి కోట్ల మోహన్ రెడ్డి, కార్యదర్శి బాగుల అంజనరావు, ములకాల కిషోర్ కుమార్, కోట్ల విజయరామరాజు, ముంజపు సాయిరాం, కనుగుల శ్రీనివాస్ రెడ్డి, పెడపెట్ల పవన్ కళ్యాణ్, చోడే గంగాధర్, మాదిరెడ్డి భూషణం, ముంజపు శ్రీరామ్, కెచ్చల పోసిరెడ్డి, ముత్యాల దుర్గాప్రసాద్, శ్రీరామ్, పవన్, అందెల శ్రీరామ్ మూర్తిరెడ్డి, కోట్ల రాజిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment