పేదవారికి సాయం చేయడం రంజాన్ పండుగ విశిష్టత

కందుకూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళే, జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఇనకొల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెట్టు గ్రామంలో మహబుసుబాని దర్గా వద్ద జెండా ఊరేగింపు కొరకు ఆర్ధికసాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల జనసేన నాయకులు అన్నంగి చలపతి, స్థానిక జనసైనికులు షేక్ రహంతుల్లా, చలంచర్ల శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలపతి మాట్లాడుతూ సర్వమత సామరస్యం తెలిపే రంజాన్ శుభసందర్బంగా ప్రతి ముస్లిం సోదరీ, సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ మాసంలో ముస్లీం సోదరీ, సోదరులు అతి పవిత్రమైన ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాకుండా ప్రతి ముస్లిం సోదరులు తమ ఏడాది మొత్తం సంపాదనలో కొంత మొత్తం “జకాత్” పేరుతో కుల, మతాలకు అతీతంగా కష్టాలలో ఉన్న పేదవారికి సాయం చేయడం రంజాన్ పండుగ విశిష్టతగా కొనియాడారు. ఈ మహబూబ్ సుభాని దర్గా వద్ద జెండా ఊరేగింపు చేస్తే భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయని మా ప్రాంత వాసుల నమ్మకం. అనాదికాలం నుంచి ఈ జెండా పండుగ జరుపుకుంటాం, శనివారం రంజాన్ సందర్భంగా జనసేన వారి సహకారంతో జరపడం ఆనందంగా ఉంది. అలాగే ఈ రంజాన్ పండుగ సందర్భంగా అల్లాహ్ ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు చేకూర్చాలని రహంతుల్లా భావించారు.