జనసేన జెండా ముగ్గుతో తన అభిమానాన్ని చాటుకున్న అనూష

నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా పేట కాలనీలో నివాసం ఉంటున్న జనసేన వీరమహిళ అనూష జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానంతో బోగి పండుగ రోజు రంగుల ముగ్గుతో పాటు జనసేన పార్టీ జెండా ముగ్గు వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానం అని వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను స్వయంగా చూడాలనే ధృడ సంకల్పంతో ఇలా ముగ్గు వేసి తన అభిమానం చాటుకున్నానని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.