డీజీపీ గౌతమ్ సవాంగ్ పై ఫైర్ అయిన హైకోర్టు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. చేతకాకపోతే తప్పుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విషయంలో కోర్టు ఈ కామెంట్స్ చేసింది. వివరాలలోకి వెళ్ళగా..

అమలాపురం మండలం ఇందుగుపల్లికి చెందిన వెంకట రాజు అదృశ్యంపై బాధితుడి మేనమామ సుంకర నారాయణ స్వామి హైకోర్టులో హెబియస్ కార్బస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంలో హైకోర్టు వెంకట రాజు విషయంలో పోలీసుల తీరును తప్పుబడుతూ కోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై మండిపడింది.

గతంలో మూడు కేసుల్లో జ్యూడిషియల్ విచారణ జరిపితే పోలీసులదే తప్పని తెలిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని వ్యాఖ్యానించింది ధర్మాసనం. ప్రతి కేసులోనూ సిబిఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో పలు పర్యాయాలు డీజీపీని కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదనీ, ఆయన పోలీస్ వ్యవస్థను నియంత్రించడంలో విఫలం అవుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *