ప్రణబ్‌ మృతికి హైకోర్టు ఘనంగా నివాళి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి హైకోర్టు సీజే నేతృత్వంలోని ఫుల్‌ కోర్టు ఘనంగా నివాళులర్పించింది. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి దేశానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తంచేస్తూ ఆయన రాష్ట్రపతిగా, ఒక ప్రజాప్రతినిధిగా, మంత్రిగా వివిధ హోదాలలో దేశానికి ఎనలేని సేవలందించారని కొనియాడింది. ఈ కార్యక్రమంలో అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌. రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.