రాజధానుల బిల్లుపై హైకోర్టు 14వరకు స్టే…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ నెల 14 వరకు రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. రిప్లై కౌంటర్ వేయాలని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది.

పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. ఈ సమయంలో హై కోర్టు స్టే ఇవ్వడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నెల 14న స్టే ముగిసిన అనంతరం కోర్టు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ప్రభుత్వం, భూములిచ్చిన రైతుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది.