సిద్ధం అనే హోర్డింగ్ లను బ్యానర్లను తక్షణమే తొలగించాలి

  • లేనిపక్షనా యుద్ధం అని మేము కూడా కడతాం – జనసేన
  • తిరుపతి సిటీలో మరియు చుట్టుపక్కల వెలసిన సిద్ధం అనే హోర్డింగ్ లకు బ్యానర్లకు చలానా రుసుము ఎవరు చెల్లించారు.?

తిరుపతి: నగరంలో సిద్ధం అంటూ వెలసిన పెద్ద, పెద్ద హోర్డింగ్ లకు బ్యానర్లకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, వాటికి చెల్లించవలసిన చలానా రుసుమును ఎవరు చెల్లించారు? ప్రభుత్వమా.. లేక అధికార పార్టీ నేతలా? ఎవరూ చెల్లించారు, ఎంత చెల్లించారో తెలియజేయాలని గురువారం వాటి వివరాలు తెలియాలని, ప్రజల సందేహాలను నివృత్తి చేయడం కొరకు కమిషనర్ గారిని జనసేన నేతలు కోరారు. జనసేన పార్టీకి సంబంధించి మా పార్టీ హోర్డింగ్ లు బ్యానర్లు వేసుకునుటకు మాకు కూడా పర్మిషన్ ఇవ్వవలసిందిగా ఆ పార్టీ నేతలు నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, హేమ కుమార్, లక్ష్మి, కొండా రాజామోహన్, రాజేష్ ఆచారి, దినేష్ జైన్, మునస్వామి, గుట్టా నాగరాజు, కిషోర్, హిమవంత్, మనోజ్, హేమంత్, ఆది, పురుషోత్తం రాయల్, వంశీ, సుబ్బు, సాయి, పురుషోత్తం, నవీన్ లతో కలిసి జనసేన తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో వెలసిన సిద్ధం అనే ఫ్లెక్సీలను తొలగించాలని లేని పక్షాన యుద్ధం అని మేము కూడా మా పార్టీ ఫ్లెక్స్ లను కట్టడం జరుగుతుందని, ప్రతిపక్షాలు బ్యానర్లు కట్టుకోవాలంటే మాకు మాత్రం పర్మిషన్ ఎందుకు ఇవ్వరని, ఒకవేళ కట్టినప్పటికి ఎన్నో ఆంక్షలు పెట్టి, కట్టిన వెంటనే వాటిని తొలగిస్తారని, ఇది మంచి పద్ధతి కాదని, ఈ ఈ పద్ధతిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.