హోప్ టీమ్ బుక్స్ డొనేషన్ సపోర్ట్

పేద విద్యార్థులకు నేరుగా సహాయం అందించడం మాత్రమే కాదు, వారి ప్రతిభను వెలికి తీయడం, భవిష్యత్తులో పోటీని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా, ఆళ్ల లక్ష్మీ దుర్గ బుక్స్ డొనేషన్ టీం ద్వారా హోప్ ఎడ్యుకేషన్ సపోర్ట్ అంటూ ఆన్‌లైన్ ఆన్లైన్ కాంపిటీషన్ ని నిర్వహించారు. ఇందులో సన్నవిల్లి గ్రామానికి చెందిన ప్రాణన్య తన ప్రతిభకు రెండవ బహుమతి అందుకుంది. మంగళవారం ఆమెకు సర్టిఫికెట్, ₹5,000 నగదు, గ్రామ పెద్దల సమక్షంలో, విద్యార్థుల మధ్య, ఆమెకు అందజేయబడింది. ప్రాణన్య, హోప్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. “ఈ బహుమతి నా చదువుకు ఎంతో ఉపకరిస్తుంది” అని వ్యాఖ్యానించారు. అంతేకాక, ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరగాలని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేసింది. హోప్ టీమ్, బుక్స్ డొనేషన్ టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Share this content:

Post Comment