ఉప్పరపల్లెలో ఇంటింటికి జనసేన కార్యక్రమం

*ఇంటింటికి జనసేన 4వ రోజు

*ఇంటింటి ప్రచారం చేస్తున్న జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

సిద్ధవటం: రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు.. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో.. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా 4వ రోజు సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో.. ఎస్సీ కాలనీలో ఇంటింటి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రజలతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుని.. జనసేన సిద్ధాంతాలను రూపొందించిన కరపత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.