పునాది దశలోనే ఇళ్లు… పేదలకు కన్నీళ్లు!

  • ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నాయకులు

రాజంపేట, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం 24 లక్షల మంది పేదలకు జగనన్న ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి పునాది దశలోనే పేదలకు కన్నీళ్లు మిగిల్చిందని రాజంపేట జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు శనివారం జగనన్న ఇళ్లు’ పేదలకు కన్నీళ్లు! అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఈ మేరకు పేదలకు అందించే ఇళ్ల స్థలాల విషయంలోనూ,స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డారన్నారు. అందులో భాగంగా మొదటి రోజు నందలూరు మండల పరిధిలోని పులపుత్తూరు గ్రామంలో గృహ నిర్మాణాల పథకాలు జగనన్న కాలనీలో సముదాయాలను సందర్శించి అవి ఏయే దశల్లో ఉన్నాయో పరిశీలించారు. ఆయా కాలనీలో విస్తృతంగా పర్యటించి లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రతి అంశాన్ని మరియు జగనన్న కాలనీలో తిష్ట వేసిన ప్రతి సమస్యపై జనసేన పార్టీ ప్రజల దృష్టికి తీసుకువచ్చి అవి పరిష్కారం అయ్యేంతవరకు ప్రభుత్వంపై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని వారు డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, ఎం.వి.ఆర్ వెంకటేశ్వర్లు, లీగల్ సెల్ కత్తి సుబ్బరాయుడు, భాస్కర్ పంతులు, పోలిశెట్టి చెంగల్ రాయుడు, బాలసాయి కృష్ణ, తాళ్లపాక శంకరయ్య, మంచిర్యాల గోవర్ధన్, వీరాచారి, జంగాల శిరీష తదితరులు పాల్గొన్నారు.