పేడాడ రామ్మోహన్ ఆధ్వర్య్మలో జగనన్న ఇళ్ళు -పేదలందరి కన్నీళ్లు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు నియోజకవర్గంలోని పొందూరు లో జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించారు. మండలంలోని తొలాపి, రాపాక, పొందూరులో పర్యటించిన రామ్మోహన్ ప్రభుత్వం పేదలకు కేటాయించినట్లు చెబుతున్న ఇళ్ల స్థలాలు ప్రజలు నివసించుటకు అనుకూలంగా లేవని, క్వారీలలో కేటాయించి పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఇంతవరకు పనులు కూడా ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందని, ఈ విషయం పై పేదలకు న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ తో పాటు మండల నాయకులు సూర్య, రమణ, రఘు, సురేష్, మధు, గణేష్, జగదీష్, చిన్నం నాయుడు, బాలకృష్ణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.