న్యాయం కోసం ఇంకెన్నాళ్లు .. సిబిఐతో వివేకా కుమార్తె సునితా రెడ్డి!

ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. దివంగత మాజీ సీఎం వై ఎస్ ఆర్ తమ్ముడు ప్రస్తుత సీఎం జగన్ కి స్వయానా బాబాయ్ కావడంతో అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. అసలు వివేకానంద రెడ్డిని హత్య ఎవరు చేశారు ఏం జరిగిందో ఓ మిస్టరీగా ఇంకా మిగిలివుంది. ఈ హత్య లో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విషయంలో కూడా ఆరోపణలు ఎక్కువగా వినిపించేవి. రాజారెడ్డి హత్య కేసులో ఉన్న వాళ్లను కూడా ఈ కేసులో కి లాగే ప్రయత్నం కొంత మంది చేశారు.అయితే అప్పుడు సిబిఐ విచారణ డిమాండ్ చేసినప్పటికీ ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి ఈ విషయంలో సీబీఐ విచారణ అవసరం లేదని కోరడం చాలా మందిని విస్మయానికి గురిచేసిన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ హత్య కేసుని సిబిఐ విచారణ చేస్తుంది. అయితే సిబిఐ విచారణ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా స్పష్టత రావడం లేదు. కరోనా వైరస్ కారణంగా ఈ విచారణ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ కేసు విచారణకు సంబంధించి వై.ఎస్.వివేకానందరెడ్డి కుమార్తె సునితా రెడ్డి ఢిల్లీ వెళ్లి తన తండ్రి హత్య కేసు విచారణ చేస్తున్న సిబిఐ అధికారులని కలిశారు. హత్య జరిగి రెండేళ్లైనా కూడా నిందుతులని పట్టుకోలేకపోయారని ఎవరు హత్య చేసారో ఇప్పటివరకు తెలియదు అని వాపోయారు. ఈ కేసు విచారణలో అసలైన దోషులను బయటపెట్టడంలో కావాలనే జాప్యం జరుగుతుందని ఆమె ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలి అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.