బొర్రబిడ్డలో మంచి నీటి సమస్య వెంటనే పరిష్కరించాలి: జనసేన డిమాండ్

  • బొర్రబిడ్డలో మంచినీటి కోసం ఎన్ని తిప్పలో

ఆరకు వేలి మండలం గన్నెల పంచాయితీ బొర్రబిడ్డ గ్రామంలో మంచి నీరు కోసం గ్రామ మహిళలు ఎన్ని తిప్పలు పడుతున్నారో అని జనసేన పార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు స్పందించారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ గ్రామంలో మంచినీరు కోసం మహిళలు వాగు దాటి మంచి నీరు సేకరిస్తున్నారు గ్రామ సచివాలయం సిబ్బందికి చెప్పిన స్పందించడం లేదు అని గ్రామస్తులు అధికారుల మీద తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బొర్రబిడ్డ ఎంపీపీ స్కూల్ టీచర్ పాసి బిడ్డకి ఎత్తుకుని గెడ్డవాగు దాటి మంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగ రీత్యా బొర్రాబిడ్డగ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేనందున ఈ రోజు రాకపోకలకు ఇబ్బంది అవుతాధి అని కనీస సౌకర్యాలు సదుపాయాలు లేకపోయినా గ్రామంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.. నిజంగా ఆ టీచర్ అమ్మ ఎంత గొప్ప మనస్సు రోజు రాకపోకలు అయితే పిల్లలకు చదువు సరిగ్గా చెప్పలేను అని గ్రామంలొనే ఉంటూ వారానికి శనివారం స్వగ్రామానికి వెళుతున్నారు. గ్రామ మహిళలు మంచి నీటి కోసం వాగు దాటి గొప్ప సాహసం చేసి మంచి నీటి తెచ్చుకుంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి బొర్రబిడ్డ గ్రామంలో మంచి నీటి సదుపాయం కల్పించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. మంచి నీటి సమస్య వెంటనే పరిష్కరించాలి లేని పక్షాన గ్రామస్తులతో కలిసి జనసేన పార్టీ గ్రామ సచివాలయాన్ని ముట్టడిస్తాం అని గ్రామస్తులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *