నమ్మి ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రజలకు ఇంత నరకం చూపిస్తారా?

ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అన్నావు మూడేళ్ళైనా ఇంకా ప్రజలు తిట్టుకుంటానే ఉన్నారు. ప్రతీ ఇంట్లో ఫోటో పెట్టుకునేలా పరిపాలన చేస్తాను అన్నావు చివరికి మీ నాన్న ఫోటోలను కూడా చెత్తకుప్పలో పడేసేలా చెత్త పాలన చేస్తున్నావు. అధికారం చేపట్టిన క్షణం నుంచి అవగాహనా రాహిత్య… అరాచకపాలనకు తెరతీసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఒక్క వర్గ ప్రజలూ సంతోషంగా లేరు…ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉండేలా కొనసాగుతున్న శాడిస్ట్ పాలన. యువకులు, శ్రామికులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు ప్రతీఒక్కరూ నీ దుష్పరిపాలనకు నరకం అనుభవిస్తున్నారు. సమస్యల్ని పరిష్కరించడం చేతకాక మరో సమస్యను సృష్టించి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసీపీ. కాసినో … ప్లబ్బు క్లబ్బులతో రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చిన క్యాబినెట్ మంత్రులు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై సమాధానం చెప్పలేక దాడులకు తెగబడుతూ తిట్ల దండకాన్ని వల్లెవేస్తున్న భూతుల శాఖా మంత్రులు. తమ శాఖ ఏదో తమకే తెలియని స్థితిలో క్యాబినెట్ మంత్రులు సర్వ రోగాలకు కరక్కాయే వైద్యం అన్నట్లుగా అన్ని వ్యవస్థల సమస్యలకు తగుదునమ్మా అంటూ సకల శాఖామంత్రిగా సజ్జల రామకృష్ణ రెడ్డి వ్యవహిస్తుండటం సిగ్గుచేటు. ఐఏయస్ లు ఐపీయస్ లు సైతం అయ్యా యస్ లుగా మార్చిన ప్రజా కంఠక పాలన. అప్పుల కుంపట్లో రాష్ట్రం అజ్ఞాతంలో ఆర్ధికమంత్రి. రాష్ట్రాన్ని ఆర్బీఐ వేలం వేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగింది. ప్రజలు తిరగబడి వైసీపీ నేతల్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు ఎంతో దూరంలో లేవు. వైసీపీ అసమర్ధ, అరాచక పాలనపై నిప్పులు చెరిగిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు. రాజన్న బిడ్డని అన్నావు… మాట తప్పను… మడమ తిప్పను అన్నావు … చిన్నవాన్ని అందరూ కలిసి అన్యాయం చేసారంటూ రాష్ట్రం అంతా తిరిగావు…ఒక్క చాన్స్ ఇవ్వండి మంచి ముఖ్యమంత్రిగా మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచేలా పాలన చేస్తాను అన్నావు… ప్రజలు నీ మాటలు నమ్మారు, నీ సానుభూతి వచనాలను నమ్మారు… అధికార సింహాసనాన్ని కట్టబెట్టారు… అదే ఈ రోజు ప్రజలపాలిట శరాఘాతమై వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది… నిన్ను నమ్మి ఒక్క చాన్స్ ఇచ్చినందుకు ప్రజలకు ఇంత నరకం చూపిస్తారా? అంటూ ముఖ్యమంత్రి జగన్ అసమర్ధ అరాచక పాలనపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమల్, నాయకులు నక్కల వంశీ, నారదాసు ప్రసాద్, ఆళ్ళ హరి, కొండూరు కిషోర్ తదితరులు విలేకరుల సమావేశంలో నిప్పులు చెరిగారు.