ఆర్యన్‏కు హృతిక్ రోషన్ మద్దతు..కంగనా ఫైర్..

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను ముంబై డ్రగ్స్ కేసులో ఇటీవలే ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్యన్ కు మద్దతుగా కొంతమంది సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు. ఇలా డ్రగ్స్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారంటూ కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. తాజాగా ఆర్యన్ కి సపోర్ట్ గా నిలుస్తూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనిని కొంతమంది నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పోస్ట్ పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ సీరియస్ అయింది. హృతిక్ రోషన్ పెట్టిన పోస్టుకు ఘాటుగా సమాధానం ఇస్తూ పోస్ట్ పెట్టింది.

కంగనా రనౌత్ తన సోషల్ మీడియాలో హృతిక్ పోస్ట్ కి స్పందిస్తూ.. ఇపుడు మాఫియా పప్పులందరూ ఆర్యన్ ఖాన్ కు రక్షణగా వస్తున్నారు. మేము తప్పులు చేస్తాం కానీ వాటిని కీర్తించకూడదు. ఇది అతడు చేస్తున్న చర్యల పర్యావసాలను అతనికి తెలియజేస్తుందని నేను నమ్ముతున్నా. అది అతన్ని మరింత మంచిగా, గొప్పగా ఉండేలా చేయగలదు. ఎవరైనా బలహీనమైపోయినపుడు వారి గురించి పుకార్లు చేయకపోవడం మంచిది కానీ ఏ తప్పు చేయలేదని వారికి అనిపించడం నేరమని, తప్పు చేసిన వారికి సపోర్ట్ చేయడం కూడా తప్పని పరోక్షంగా హృతిక్ రోషన్ పోస్టుకు కౌంటర్ ఎటాక్ చేసింది కంగనా.