పెద్దేవం గ్రామం నుంచి జనసేనలో భారీ చేరికలు

*ర్యాలీతో ఘన స్వాగతం
*కార్యక్రమంలో ముఖ్య అథిదిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్

కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో ఆదివారం జనసేన పార్టీలో ఘనంగా చేరికలు జరిగాయి. గ్రామ అభివృద్ధి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే సాధ్యమని విశ్వసించిన పెద్దెవం గ్రామ పెద్దలు సుబ్రహ్మణ్యం నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గ్రామ దేవత ఆశీస్సులతో ఊరేగింపుగా బుల్లిపాడు కాకాని వారి కళ్యాణ మండపానికి చేరుకొని, ఆనందంగా జనసేనలో చేరారు.
ఈ కార్యక్రమాన్ని కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జి టివి రామారావు సమన్వయం చేశారు. అదే విధంగా తాళ్లపూడి మండలంలోని అనేక గ్రామాల నుంచి పలువురు జనసేనలో చేరారు. మంత్రి దుర్గేష్ షెడ్యూల్ కారణంగా ఆలస్యంగా విచ్చేసి, కాపవరం నుంచి ర్యాలీగా తీసుకెళ్లి, వారి సమక్షంలో పార్టీలోకి సభ్యులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరావు, ఎఎంసీ డైరెక్టర్ కొప్పాక విజయ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి పెరుగు శివ, వాసిరెడ్డి వెంకటేశ్, మడిచర్ల నాగరాజు, పూటి జగదీష్ తదితర నేతలు, గ్రామాధ్యక్షులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment