జనసేనలోకి భారీ చేరికలు

*వైసీపీ నుండి జనసేనలోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో 200 కుటుంబాల భారీ చేరికలు..

*టపాసులతో చిలకం మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి అడుగడుగునా నీరాజనం పట్టిన నిమ్మలకుంట గ్రామ ప్రజలు..

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం మండలం, నిమ్మలకుంట గ్రామంలో 200 కుటుంబాలు చేరారు. చేరిన వారు మాజీ సర్పంచ్ సింగంశెట్టి ఉమాదేవి, సింగంశెట్టి లక్ష్మీనారాయణ, సింగంశెట్టి కుళ్లాయప్ప, సింగంశెట్టి కృష్ణమూర్తి, బాబు, పద్మావతి, రమాదేవి, శిరీష, రామాంజనమ్మ, లక్ష్మీదేవి, ముత్యాలమ్మ, గీత, అశ్విని, సుజాతమ్మ, రమణమ్మ, అలేఖ్య, రాజేంద్రప్రసాద్, సత్యనారాయణ, రామాంజనేయులు, శంకర కుమార్ నారాయణస్వామి, సాయిశంకర్, అశోక్ కూమార్, సింగంశెట్టి లోకేష్ కుమార్, మురళీ మోహన్, శ్రీనివాసులు, రామాంజనేయులు, సంజీవరాయుడు, నారాయణ, శ్రీకాంత్, కృష్ణమూర్తి నారాయణ స్వామి, రాము, సాయికిరణ్, నాగభూషణ్ మరియు తదితరులు వీరందరికీ చిలకం మధుసూదన్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతలకు అనుకూలంగా పని చేసి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి మంచి పేరు తీసుకురావాలని ఆయన నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి మనమందరం పాటుపడాలని అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారమే మన పార్టీ యొక్క ముఖ్య లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-06-at-9.00.11-PM-1024x451 జనసేనలోకి భారీ చేరికలు

Share this content:

Post Comment