రాజానగరంలో వైఎస్సార్సీపీకి భారీ ఎదురుదెబ్బ

*ఫరిజల్లిపేట సర్పంచ్ సహా 150 మంది జనసేనలోకి
*రాజానగరం నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే “బత్తుల” పనితీరుకు వైసీపీ శ్రేణులు జనసేన వైపు ఆకర్షణ

రాజానగరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫరిజల్లిపేట గ్రామ సర్పంచ్ వుండమట్ల సత్యవతితో పాటు సుమారు 150 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు శనివారం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ప్రజల మద్దతుతో నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధిపథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నాయకత్వం, ప్రజలలో స్థిరపడుతున్న విశ్వాసం జనసేన వైపు ఆకర్షణను పెంచుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలు చేతులెత్తేయగా, మిగిలిన క్యాడర్ భవిష్యత్తుపై గందరగోళంలో పడిన పరిస్థితి స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు, పార్టీ కండువాలు అందించి, కొత్తగా చేరినవారిని జనసేన కుటుంబంలో సాదరంగా ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సేవా భావన, రాష్ట్రాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి ఈ చేరికలకు ప్రేరణగా మారినట్లు చేరినవారు తెలిపారు. చేరిన వారిలో సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, పాలసంఘం నేతలు, యువకులు, మహిళలు వంటి అనేక వర్గాల ప్రతినిధులు ఉండటం విశేషం. రాజానగరంలో కూటమి నాయకత్వం పట్ల పెరిగిన నమ్మకం, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజల మధ్య ఉండే తత్వం – ఇవన్నీ జనసేన బలోపేతానికి దోహదం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ చేరికలు జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

WhatsApp-Image-2025-06-29-at-7.40.41-PM-1-1024x683 రాజానగరంలో వైఎస్సార్సీపీకి భారీ ఎదురుదెబ్బ

Share this content:

Post Comment