మానవ సేవే మాధవ సేవ: డా. మాధవ రెడ్డి

  • జనసేన కార్యకర్త ఎదురుగట్ల రాజేష్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచిన డా. మాధవ రెడ్డి

శేరిలింగంపల్లి నియోజకవర్గం: స్థానిక శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని ఇంద్రా రెడ్డి కాలనీలోని, జనసేన పార్టీ కార్యకర్త ఎదురుగట్ల రాజేష్ గౌడ్ గృహంలో ప్రమాద వశాత్తూ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లోని వస్తువులు మరియు సామాగ్రి కాలిపోయి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాజేష్ గౌడ్ కుటుంబాన్ని బుధవారం జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ డా. మాధవ రెడ్డి పరామర్శించటం జరిగింది. ఈ సందర్భంగా మాధవ రెడ్డి మాట్లాడుతూ జనసేన కార్యకర్త, సామాజిక కార్యకర్త మరియు సమాజ సేవలో ఎల్లప్పుడు ముందుండే ఎదురుగట్ల రాజేష్ గౌడ్ గారి ఇంటిలో షార్ట్ సర్క్యూట్ అవటం దురదృష్టకరం మరియు బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. తమ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని మనో ధైర్యాన్నిచ్చి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాజేష్ గౌడ్ కుటుంబానికి డా. మాధవరెడ్డి ఆర్థిక సాయం చేసారు. రాజేష్ గౌడ్ కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. సమాజంలో తోటి వ్యక్తులకు ఆపద వచ్చినప్పుడు మనకు మనంగానే తోడున్నామనే ధైర్యాన్నివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ నాగలక్ష్మి నాయకులు అరుణ్,‌ కళ్యాణ్ చక్రవర్తి, హనుమంత్ నాయక్, ఉపేంద్ర, శివ, అభిరాం, సాజిత్, గాంధీ, రఘు, సాయి, కిషోర్, సాంబ, సంతోష్ తదితరులు పాల్గోన్నారు.