ఆంధ్ర రాష్ట్రంలో మంట కలుస్తున్న మానవత్వం: దారం అనిత

మదనపల్లె, ఆంధ్ర రాష్ట్రంలో హాస్పిటల్స్ లో అంబులెన్స్ మాఫియా ఉందన్న విషయం మీకు తెలుసా కుమారుడు చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక అభాగిని తో అమానవీయంగా వ్యవహరించారు వేల రూపాయలు చార్జీ భరించలేనని మొత్తుకున్నా కనికరించలేదు అతని యజమాని హాస్పిటల్ కి 5 వేల రూపాయలకు ఆంబులెన్స్ మాట్లాడి పంపితే రుయా ఆసుపత్రి ఆంబులెన్స్ మాఫియా అడ్డుకున్నారు. చేసేది లేక కుమారుని మృతదేహాన్ని భుజంపై వేసుకుని ద్విచక్రవాహనంపై బయల్దేరాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి రుయా హాస్పిటల్ లో జరగడం యావత్ రాష్ట్రాన్ని కలిచివేసింది …ఏమాత్రం అనుభవం లేని తక్కువ వయసులో ఉన్న వారికి మంత్రి పదవులు ఇస్తే రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది వెంటనే స్పందించి ఆ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అదేవిధంగా వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని రాత్రి సమయాల్లో కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆంబులెన్స్లు నడిపేలా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నామని జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *